Showing posts with label Movie-News. Show all posts
Showing posts with label Movie-News. Show all posts

Samantha is celebrating her birthday April 28

newsreviews9 9:58:00 AM Add Comment



Samantha is celebrating her birthday today April 28. The beautiful actress is currently shooting for the last portion of Trivikram’s ‘A Aa’ and Mahesh Babu’s ‘Brahmotsavam’. On the other hand her next release is ‘24’ that hits on 6th May in both Telugu and Tamil languages

Pawan Kalyan's new movie News

newsreviews9 7:03:00 PM Add Comment


Powerstar Pawan Kalyan has begun his new film. This yet-to-be titled movie is being directed by S J Suriya. The film was formally launched this morning (April 27th) in Hyderabad. It was a low-key pooja ceremony that has saw attendance of selected few.

Pawan Kalyan attended the event. Director S J Suryah shot the muhurtham scene on the photos of deities. The Muhurat shot clap was sounded by producer Sudhakar Reddy, while Gowtham Raju switched on the camera and director S.J Suryah directed the first shot.

The film is being produced by Sharrath Marar under the Northstar Entertainment banner. “Pre Production work is in progress and the first schedule is planned to commence in June”, stated Sharrath Marar.

This is third film in the hit combination of Pawan Kalyan and S J Surya of ‘Kushi’ fame. Anup Rubens is composing the music.

The launch of this new film took place at producer Sharat Marar's office in Hyderabad.

S.J Suryah along with writer Akula Siva have been working on the story for the last 4 months, constantly discussing and sharing the progress with Pawan Kalyan. The director of photography is Soundar Rajan who has earlier done 'Billa' and recently 'Bengal Tiger'.

Gowtham Raju is the editor.Art director is Bramha Kadali and twin brothers Ram-Lakshman are the action directors. Story and dialogues by Akula Siva. Screenplay-direction by S.J Surya.

మోహన్‌బాబు రాజకీయరంగ ప్రవేశంపై విష్ణు వ్యాఖ్యలు

newsreviews9 8:02:00 AM Add Comment
 
తాను త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానన్న మోహన్‌బాబు వ్యాఖ్యలపై ఆయన కుమారుడు, సినీ హీరో విష్ణు స్పందించాడు. నాన్న రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు పలు విషయాలపై స్పందించాడు. తమతో కలిసి సినిమాలు చేస్తూ ఆనందంగా గడపాలనుకుంటున్నామన్నాడు. తన సినిమాకు సంబంధించిన ప్రతీ స్క్రిప్ట్‌ను నాన్న వింటారని తెలిపాడు. స్క్రిప్ట్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం కచ్చితంగా ఉంటుందన్నాడు. అయితే సినిమాలు ఫెయిల్ అవడం దర్శకత్వ లోపమేనని విష్ణు వ్యాఖ్యానించాడు. నటులందరూ దర్శకుల చేతలో కీలుబొమ్మలనీ, వారు చెప్పినట్లే తాము చేస్తామని చెప్పాడు. ఇటీవల తాను నటించిన రౌడీ, అనుక్షణం సినిమాలు నటుడిగా సంతృప్తి కలిగించాయని అన్నాడు.

మే 6న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో?

newsreviews9 7:50:00 AM Add Comment
 
మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. కాజల్‌, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆడియోను మే 6న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మే 20న బ్రహ్మోత్సవం విడుదల కానుంది.

సల్మాన్‌కి నిశ్చితార్థం అయిపోయిందా?

newsreviews9 7:45:00 AM Add Comment
 

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ రొమేనియన్‌ మోడల్‌ యులియా వంటూర్‌లు ప్రేమించుకుంటున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఓ పక్క ఈ పుకార్లను కొట్టిపారేస్తూనేమరోపక్క వీరిద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. మరోపక్క సల్మాన్‌కి వంటూర్‌తో నిశ్చితార్థమైందన్న వార్తలు వెలువడుతున్నాయి.  అసలు విషయంమేంటంటే.. సల్మాన్‌, వంటూర్‌తో కలిసి అలనాటి నటి, రాజకీయవేత్త బీనా కక్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ సల్మాన్‌ సరదాగా తోటపని చేసి అనంతరం పైపుతో చేతులు కడుక్కుంటుండగా ఫొటోలు తీశారు. అప్పుడు సల్మాన్‌ కుడిచేతికి ఉంగరం కన్పించింది. దీంతో సల్మాన్‌కి ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందంటూ పుకార్లు ఇంకా పెరిగాయి. అదీ కాకుండా ప్రస్తుతం సల్మాన్‌ నటిస్తున్న సుల్తాన్‌ చిత్ర షూటింగ్‌ సెట్స్‌కు వంటూర్‌ వెళ్లింది. ఈ ఫొటోలను బీనా కక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి సల్మాన్‌ ఏం సమాధానం చెప్తాడో చూడాలి.

చిరంజీవి 150వ చిత్రానికి శభముహూర్తం ఫిక్స్

newsreviews9 7:53:00 AM Add Comment

ఎప్పుడెప్పుడా అంటూ మెగాస్టార్ అభిమానులు గత కొన్నాళ్లుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 29 తరువాత పుష్కరాలు, మూడాల నేపథ్యంలో ఎలాంటి శుభముహుర్తాలు లేనందున.. ఆ లోపుగానే తన 150వ చిత్రానికి ముహుర్తాన్ని ఫిక్స్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇక త్వరలోనే చిరు 150 చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులను చేపట్టి సెట్ పైకి రానుంది. 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించిన చిరంజీవి.. తన 150వ చిత్రానికి..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 29న మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళ హిట్ మూవీ 'కత్తి’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

ఈ ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ వేడుకకు ఇండస్ట్రీలోని ప్రముఖులంతా హాజరుకానున్నట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి తగిన విధంగా, మెగా అభిమానులకు నచ్చే విధంగా మార్పుల చేసిన అనంతరం కథను వివి వినాయక్ ఫైనల్ చేశారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సంవత్సరం మొదటల్లోనే సినిమా మొదలవ్వాల్సి ఉన్నా.... చిరంజీవి చిన్నకూతురు శ్రీ వివాహం కారణంగా సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడిందని సినీవర్గాల టాక్.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తరువాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చిరంజీవి గత కొన్నాళ్ళుగా సినిమా పరిశ్రమకు దూరంగా వున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ సినిమా ఫంక్షన్ లో తాను 150వ చిత్రంలో నటించనున్నట్లు చిరు ప్రకటించి తన అభిమానులో అశలను రేపారు. అది మొదలుకుని ఎప్పడెప్పుడా అంటూ మెగా ఫ్యాన్స్ ఎదురుచూడటం మొదలైంది. ఈ నేపథ్యంలో వారి నిరీక్షణ ఫలించి.. ఆ శుభ ముహూర్తం రానే వచ్చింది. మాస్ మసాలా ఎంటర్టెనర్ గా, అభిమానులకు విందు భోజనంలా ఈ సినిమా రూపోందించనున్నారు వినాయక్. పూర్తి కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న వినాయక్ మెగా అభిమానుల కరువును తీర్చనున్నారు.

రెజీనా కొత్త నిర్ణయం

newsreviews9 7:44:00 AM Add Comment
 
నటి రెజీనా కెరీర్‌కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజతంత్రం అంటూ తమిళంలో కొన్ని చిత్రాలలో మాత్రమే నటించిన రెజీనా తెలుగులోనూ తక్కువ చిత్రాలలోనే నటించారు. ప్రముఖ హీరోయిన్‌గా తాను రాణించాలనే ఆసక్తి రెజీనాకు అధికంగానే ఉంది. ఆమె నటనకు ప్రశంసలు అందాయి. అయితే తనకు తగిన పాత్రలు ఎంపిక చేయకపోవడం, ఫెయిల్యూర్ చిత్రాలలో నటించడం ఆమె పురోగతికి అడ్డుగా నిలిచింది. షూటింగ్‌కు వచ్చినా ఎవరితోను మాట్లాడకుండా దూరంగా కూర్చునేవారు.

దీంతో సహ నటీనటులు ఆమెతో సహజంగా మెలిగేందుకు సంశయించేవారు. ఇతరులతో సన్నిహితంగా ఉంటే తిప్పలు తప్పవని భావించిన రెజీనాకు అదే తంటాగా మారింది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే చిత్రరంగంలో చాలా ఏళ్లు గడిచిపోయాయి. పాత పొరపాట్లను తలచుకుని మనస్తాపానికి గురైన రెజీనా ప్రస్తుతం ఇతరులతో సన్నిహితంగా మెలుగుతున్నా స్నేహం అని చెప్పుకునేందుకు పెద్దగా లేరు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో అవకాశాలను అందుకునేందుకు గ్లామరస్‌గా నటించేందుకు సిద్ధమని ప్రకటించారు.

రియల్ పాత్ర వివాదం

newsreviews9 7:40:00 AM Add Comment


భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితంపై ఇమ్రాన్ హష్మీ హీరోగా హిందీలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘అజహర్’ సినిమాలో అజహరుద్దీన్ జీవితం, ఆయన మాజీ భార్య అయిన సినీ నటి సంగీతా బిజ్లానీ సహా పలువురు నిజజీవిత వ్యక్తులు పాత్రలు కనిపించడం సహజం. సంగీతా బిజ్లానీ పాత్రను వెండితెరపై నర్గిస్ ఫక్రీ పోషించనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదంగా మారింది. మొదట్లో ఈ సినిమా, అందులోని పాత్ర గురించి మాట్లాడేందుకు చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతను కలిసే ప్రయత్నం చేశారు.

కానీ, ఈ ప్రాజెక్ట్‌తో తమకేమీ సంబంధం లేదని సంగీత తేల్చేశారు. తీరా ఇప్పుడు తనతో ఏ మాత్రం పోలిక లేని నర్గిస్ ఫక్రీ ఆ పాత్రను పోషించడం సంగీతకు నచ్చట్లేదని వినికిడి. దాంతో, రేపు సినిమాలో తన పాత్రను సరిగ్గా తీర్చిదిద్దకపోతే ఆమె చట్టపరంగా చర్య తీసుకోవాలని భావిస్తున్నారట! అయితే, అజహరుద్దీన్ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లోని భావోద్వేగభరిత ఘట్టాలకు వెండితెర రూపమైన ఈ సినిమాలో నటిస్తున్నందుకు నర్గిస్ ఫక్రీ మాత్రం మహదానందపడిపోతున్నారు. వీలుంటే, త్వరలోనే సంగీతా బిజ్లానీని స్వయంగా కలవాలని కూడా భావిస్తున్నారు. ‘‘ఈ సినిమాలో ఆమె (సంగీత పాత్ర)ను ఎంతో హుందాగా దర్శకుడు తీర్చిదిద్దారు.

మా దర్శకుడు చెప్పినట్లే చేశాను. కాకపోతే, ఆమె గురించి అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం చదివాను. పరిచయస్థుల ద్వారా అజహర్, సంగీతల జీవితం గురించి తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో, ‘‘స్క్రిప్ట్‌లోని పాత్రలన్నీ నిజజీవితంలో సజీవంగా ఉన్నవారివి కాబట్టి, కచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి, కొంత భయంగా కూడా ఉంది’’ అన్నారు. మొత్తానికి, నిజజీవిత కథల మీద ఆధారపడి తీస్తున్న సినిమా అంటే, ఆ నిజజీవిత వ్యక్తులకైనా, ఈ తెర మీద నటిస్తున్నవాళ్ళకైనా అనుమానాలు, భయాలు సహజమే కదూ!

అ..ఆ.. టీమ్‌తో పవన్ కళ్యాణ్

newsreviews9 8:40:00 AM Add Comment


ఇటీవల ‘సర్దార్‌’గా తెరమీదికొచ్చిన పవన్ తాజాగా ‘అ.ఆ..’ సెట్లో తళుక్కుమన్నారు. నితిన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. నితిన్ సహా ఇతర కీలక పాత్రధారులపై హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌లోకి పవన్ రావడం పట్ల ‘అఆ’ హీరో పవన్ అభిమాని అయిన నితిన్, దర్శకుడు త్రివిక్రమ్ సంతోషం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్‌, ఇతర కాస్ట్ అండ్ క్రూతో కాసేపు పవన్ ముచ్చటించడం పట్ల చిత్ర బృందం ఖుషీగా ఉందని హీరో నితిన్ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా మే 6 విడుదల కానున్న సంగతి తెలిసిందే.

మణిరత్నం సినిమాలో అదితీ రావు హైదరీ

newsreviews9 8:28:00 AM Add Comment
మలయాళ చిత్రం ‘ప్రజాపతి’ (2006) సినిమాతో తెరంగేట్రం చేసిన అదితీ రావు హైదరీ అటుపై బాలీవుడ్ పయనమై ‘రాక్‌స్టార్’, ‘వజీర్’, ‘ఫితూర్’ తదితర సినిమాలతో నటిగా చక్కటి గుర్తింపు తెచ్చకుంది. తాజాగా ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం సినిమాలో అవకాశం అందుకుందట ఈ హైదరాబాదీ. ‘ఓకే బంగారం’ తర్వాత కార్తి - మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి సరసన నటించేందుకు పలువురు భామల పేర్లు పరిశీలనకు వచ్చినా కడకు ఈ అవకాశం అదితిని వరించిందట. దీంతో హీరోయిన్ల వేటకు తెరపడినట్టే. జూన్ మొదటివారంలో సినిమా షూటింగ్ మొదలవనుంది.

శింబు ఆవేదన

newsreviews9 7:50:00 AM Add Comment
 
ఈ ఏడాది తమిళ నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 2006 నుంచి 2015 వరకూ అధ్యక్ష పదవిలో ఉన్న నటుడు శరత్‌కుమార్‌ని ఓడించాలనే పట్టుదలతో సీనియర్ నటుడు నాజర్, యువ హీరోలు విశాల్, కార్తీ తదితరులు భారీ ఎత్తున ప్రచారం చేశారు.

 చివరికి అనుకున్నది సాధించారు. కాగా, శరత్‌కుమార్‌ని సపోర్ట్ చేసినవాళ్లల్లో హీరో శింబు ఒకరు. ఆయన ఓడిపోవడం ఈ హీరోని బాధపెట్టి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, ఉపాధ్యక్షుడిగా శరత్‌కుమార్ ప్యానెల్ నుంచి పోటీపడిన శింబూకి కూడా నిరుత్సాహమే ఎదురైంది. కాగా, కొన్నేళ్లుగా నడిగర్ సంఘంలో సభ్యుడిగా ఉన్న శింబు ఇప్పుడు తప్పుకుంటున్నానని పేర్కొనడం విశేషం.

 ఏ ఆర్టిస్ట్‌కైనా సమస్య వచ్చినప్పుడు, దాని పరిష్కారానికి నడిగర్ సంఘం ముందుకు రావాలని శింబు అన్నారు. తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్ సంఘం ఏ సహాయమూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవల నిర్వహించిన స్టార్ క్రికెట్ మ్యాచ్ పట్ల కూడా తాను అసంతృప్తిగా ఉన్నానని శింబు పేర్కొన్నారు.

చారుశీల గా వస్తున్నా రష్మిగౌతమ్

newsreviews9 10:10:00 AM Add Comment

రష్మిగౌతమ్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, జశ్వంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చారుశీల. కెమెరామెన్ వి.శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను భీమనేని శ్రీనివాసరావు, ఫస్ట్‌లుక్‌ను జి.నాగేశ్వరరెడ్డి, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ దర్శకుడు సాగర్‌గారు బాక్సాఫీస్ వద్ద కోట్లు వసూలు చేసే చిత్రాల్ని అందించే శిష్యులను చిత్ర పరిశ్రమకు అందించారు. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్న ఆయన కోట్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంతో తమ్ముడు శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా, ఆయన తనయుడు జశ్వంత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక థ్రిల్లర్ సబ్జెక్ట్. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. కెమెరామెన్‌గా 100 చిత్రాలు పూర్తయిన తరువాత దర్శకుడిగా సినిమా చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్‌కు కథ చెప్పిన వెంటనే సినిమా చేద్దామని మొదలుపెట్టారు. వీల్‌చైర్‌లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల అద్భుతంగా నటించారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, బాబ్జీ, చిత్ర సమర్పకులు కొండపల్లి తదితరులు పాల్గొన్నారు. 

నాని జెంటిల్‌మన్ రాముడా రావణుడా ? ఫస్ట్‌లుక్ పోస్టర్

newsreviews9 8:27:00 AM Add Comment

30 ఇయర్స్ పృధ్వీ పెళ్లి సందడి

newsreviews9 8:00:00 AM Add Comment


‘ఖడ్గం’ చిత్రంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృధ్వీరాజ్. ఈ మధ్య కాలంలో తను చేసిన చిత్రాలన్నింటిలోనూ తనదైన మార్క్ కామెడీతోనే కాకుండా సినిమా సినిమాకీ వెరైటీ గెటప్‌లతో అలరిస్తూ..నవ్విస్తున్నాడు పృధ్వీరాజ్. తాజాగా హీరోగా మారిపోయాడు. ‘గోవా రాజు గారి పెళ్లి సందడి’ అనే సినిమాతో హీరో అవతారం ఎత్తిన పృధ్వీ పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. సుముహూర్తం .. ఏప్రిల్ 23, 2016 ఉదయం 10 గం.లకు, హైదరాబాద్, బంజారాహిల్స్‌లో పెళ్లి అని ప్రకటించారు. ఇటీవల కాలంలో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ ‘ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప’గా తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన పృధ్వీ రాజ్ ‘గోవా రాజు’గా ఎలా అలరిస్తాడో చూడాలి...

బాలకృష్ణ తల్లి పాత్రలో హేమ మాలిని

newsreviews9 8:17:00 AM Add Comment

నందమూరి బాలకృష్ణ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలీవుడ్‌ నటి హేమ మాలిని నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రలో హేమ మాలిని కనిపించనున్నారని టాక్‌. ఇటీవల ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక, లొకేషన్ల వేటతో బిజీగా ఉన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రమిది. 2000 సంవత్సరాల కిందట కథ ఇది. అందుకే తగిన లొకేషన్లను అన్వేషించడానికి క్రిష్‌ బృందం యూరప్‌ పయనమైంది. ఈలోగా నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తారు. 1971లో వచ్చిన ‘శ్రీకృష్ణ విజయం’లో ‘జోహారు శిఖిపించ మౌళి..’ అనే పాటలో కనిపించారు హేమ మాలిని. ఆ తరువాత తెలుగులో నటించనే లేదు. ఇప్పుడు 45ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటించనున్నారన్నమాట. అయితే ఇదే పాత్ర కోసం శోభన పేరు కూడా పరిశీలనలో ఉంది.

గోపి చంద్ అక్షిజెన్ సినిమ ఫస్ట్ లుక్ పోస్టర్

newsreviews9 8:10:00 AM Add Comment



గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్‌’. రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయికలు. జగపతిబాబు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.ఐశ్వర్య నిర్మాత. గురువారం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఒక విభిన్నమైన కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. గోపీచంద్‌ని తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఆసక్తి రేకెత్తిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. కిక్‌ శ్యామ్‌, అలీ, బ్రహ్మాజీ, సితార, అభిమన్యుసింగ్‌, సాయాజీ షిండే, చంద్రమోహన్‌, సుధ, ప్రభాకర్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

సర్దార్ గబ్బర్ సింగ్ తో సాక్షి ఇంటర్వ్యూ

newsreviews9 6:06:00 PM Add Comment


హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో పవన్‌కల్యాణ్ ఆఫీస్. ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం ముందు హాలులో మీడియా ప్రతినిధులు వెయిటింగ్. వెయిటింగ్ హాలు దాటి ఆ డూప్లెక్స్ హౌస్‌లో లోపలికి వెళితే, ఒక చిన్న టేబుల్ మీద చాలా తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలు... ఆ పక్కనే పుస్తకాల బీరువా. పక్కనే ఉన్న చిన్నగదిలో బల్లపై విశ్వనాథ సత్యనారాయణ ‘హాహా హూహూ’, గుంటూరు శేషేంద్ర శర్మ ‘ఆధునిక మహాభారతం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’, హిందీ, ఇంగ్లీష్ సాహిత్య రచనలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.

సోఫాలో పవన్ కల్యాణ్. నిర్మాత, చిరకాల మిత్రుడైన శరత్‌మరార్‌తో మంతనాలాడుతున్నారు.
కోట్ల ఖర్చు, వంద కోట్ల వ్యాపారం చేసిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను ఆఘమేఘాల మీద పూర్తి చేసి, అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేసిన పవన్ అనేక నెలల కష్టం నుంచి కాస్తంత సేద తీరుతున్నారు. ఓపెనింగ్స్‌తో సంచలనం సృష్టిస్తున్న ‘సర్దార్...’ గురించి ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యాంశాలు...

కంగ్రాట్స్ అండీ! చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీదకొచ్చారు!
థ్యాంక్స్. కొన్ని నెలలుగా పడ్డ కష్టం తెర మీదకొచ్చేసింది.

తెరపై మీ గుర్రపుస్వారీ అదీ చూస్తే, బాగా చేయి తిరిగినట్లుంది!
(నవ్వేస్తూ...) నిజానికి, నాకు గుర్రపుస్వారీ రాదు. ఎప్పుడూ నేర్చుకోలేదు. ‘గబ్బర్ సింగ్’ టైమ్‌లో తొలి సారిగా గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. కింద పడి, తల పగిలితే ఏమిట్రా బాబూ అని కొద్దిగా భయం వేసిందంటే నమ్మండి. అప్పుడు నేను గుర్రం దగ్గరకెళ్ళి దానితో మాట్లాడా. (నవ్వులు..) నాకు గుర్రపుస్వారీ రాదని, సహకరించమని చెప్పుకున్నా. నా కమ్యూనికేషన్ ఏమర్థమైందో ఏమో గుర్రం సహకరించింది. ఒకసారి జీను పెకైక్కి కూర్చున్నాక, నాకు తెలియకుండానే పట్టు దొరికింది. అంతే! ఇక, ‘సర్దార్ గబ్బర్ సింగ్’కి నాకు అలవాటై పోయింది. ముఖ్యంగా ఈ సిన్మాకు వేసిన సువిశాలమైన రతన్‌పూర్ సెట్ ప్రాంగణంలో అటూ, ఇటూ తిరగడానికి గుర్రమే వాడా. షాట్‌కీ, షాట్‌కీ మధ్య గ్యాప్‌లో రోజుకు అయిదారు సార్లు గుర్రపు స్వారీ చేశా! నాతో పోలిస్తే, అన్నయ్య (చిరంజీవి) అవలీలగా, స్వారీ చేస్తారు. ఆయనకు బాగా వచ్చు. నేను బాగా వచ్చినట్లు నటించాను (నవ్వులు).

జీవితంలోనూ, తెర మీదా తుపాకీలకూ, మీకూ అవినాభావ సంబంధంలా ఉందే!
గన్స్... (క్షణమాగి, నవ్వుతూనే...). నేను మొదట ఏమని ఆలోచిస్తానంటే, మనం పని చేస్తున్న విషయం ప్రామాణికంగా ఉండాలనుకుంటా. అందుకనే, ఈ సినిమాలో వాడిన గన్స్ అన్నీ నిజమైన రక రకాల గన్స్ తాలూకు నమూనాలుగా చేయించా. ‘మద్రాస్ రైఫిల్ క్లబ్’లో మెంబర్‌ని. అక్కడి నా పరిచయాలన్నీ వాడుకొని, వాళ్ళ సలహా సూచనలతో ఆ నమూనాలు చేశాం. బేసిక్‌గా మొక్కలు, తుపాకులు బాగా ఇష్టం.

ఎర్ర తుండు వేసుకున్నారు. మొక్కలు... తుపాకులా? లేక అడవులు... తుపాకులా?
(నవ్వేస్తూ) ఇప్పటికైతే మొక్కలు, తుపాకులే!

మార్షల్‌ఆర్ట్స్‌పై మీ ప్రేమను క్లైమాక్స్‌లో చూపినట్లున్నారు!
అవునండీ! క్లైమాక్స్‌లో విలన్‌తో చేసే ఫైట్‌లో ఫిలిప్పైన్స్‌కు చెందిన మార్షల్ ఆర్ట్ ‘ఎస్‌క్రిమా’ వాడాను. అలాగే, మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెంపొందించిన చైనీస్ తరహా కుంగ్‌ఫూ ‘జీత్ కునే డో’ కూడా! ఇవన్నీ ‘జానీ’ సినిమా టైమ్‌లో నేర్చుకున్నా. ప్రత్యర్థిని బ్లాక్ చేయడం, పంచ్ కొట్టడం - రెంటికీ పెద్ద గ్యాప్ ఉండదు.
ఇవున్నా ‘ఆగడు’, ‘కిక్2’లతో పోలుస్తూ, విమర్శలొచ్చాయే!
‘తొలిప్రేమ’ సినిమా చేసినప్పుడు కూడా పనికి మాలిన ఆకతాయిల కథ అని విమర్శకులు చీల్చి చెండా డారు. కానీ, సిన్మా బ్లాక్ బస్టర్. ఇవాళ్టికీ చెప్పుకుంటున్నారు. అందర్నీ తృప్తిపరచడమనేది అసాధ్యం. ఏమైనా, ప్రశంసల్లానే విమర్శల్నీ తీసుకోవాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మెచ్చుకొనే వాళ్ళూ, తిట్టేవాళ్ళూ - ఇద్దరూ నాకు సమానం.

కానీ, ఒకే రకమైన సిన్మాలు తీస్తుంటే... చూస్తుంటే...?
నిజమే. కానీ ఎవరి సిన్మాలు కొత్తగున్నాయి? మనమెంతసేపటికీ నిర్ణీత వాణిజ్య ఫార్మట్‌లో చిక్కుకుపోతున్నాం. బావిలో కప్పలైపోతు న్నాం. హీరో అంటే పాటలు, ఫైట్లు, డ్యాన్‌‌సలు, కామెడీ చేయాలి. అంచనాలతో వచ్చే ఒత్తిడి అదనం. నాతో సహా ఎవరికైనా ఇదే పరి స్థితి. కానీ, భారతీయ నేపథ్య కథల్ని హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లేతో చెప్పాలి. పాటల్లేని అలాంటి స్వతంత్ర సిన్మాలు మా సంస్థలో తీస్తా.

బాహుబలి’ తెలుగు సిన్మాను ఉన్నతశిఖరాలకు చేరిస్తే, ‘సర్దార్...’ మళ్ళీ కిందకు తీసుకుపోయిందన్నట్లు రామ్ గోపాల్‌వర్మ ట్వీట్ చేశారు...
 అలాగా! చూడలేదండీ! వీళ్ళంతా ప్రిడిక్టబుల్ పీపుల్.

మీకూ, ఆయనకూ మధ్య ఏమైనా తేడా పాడాలున్నాయా?
(క్షణమాగి) అప్పట్లో ఆయన ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్’ కథ చెప్పారు. ఆ సిన్మా నేను చేయలేదు. అంతే. అయినా ఆయన విచిత్ర మైన వ్యక్తి. నన్నడిగితే, ఆయన బయటవాళ్ళ మీద పెట్టే శ్రద్ధ తనపై, తన సిన్మాలపై పెడితే వేరే స్థాయికి వెళ్ళేవారు.

కానీ ఎవరైనా కామెంట్ చేస్తుంటే?
(మధ్యలోనే) సిన్మా గురించైనా, పాలిటిక్స్ గురించైనా కామెంట్ చేయడం చాలా తేలిక. కానీ, పాలి టిక్స్‌లోకొచ్చి జనం ముందు మాట్లాడ్తే తెలుస్తుంది. అంతెందుకు ఆయన్ని (వర్మ) సెక్యూర్టీ లేకుండా విజయ వాడలో నుంచి వెళ్ళమనండి! కుదరదు. ఏమైనా, క్రిటిక్స్ చేయాల్సిన పని వేరు. ఫిల్మ్ మేకర్ చేయాల్సిన పని వేరు. ఆయన తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటాను. కాదంటే, నాకూ లోపల వేరే భాష చాలా ఉంది. నేనూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలను.

మీరు ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’ కంటిన్యూస్ అన్నారే?
 అవునండీ! చేస్తాం.

ఏంటి? ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండానేనా?
రిజల్టంటే ఏమిటి? ఒక సిన్మాకు ఎంత డబ్బులు పెట్టాం, ఎంత వచ్చాయనేగా! మరీ, నా సినిమా రూ.400 కోట్లు సంపాదించాలని లక్ష్యం పెట్టకండి! (నవ్వు)  ఎండ్ టైటిల్స్‌లో చెప్పినట్లు ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’ చేస్తాం.

మొత్తానికి ‘గబ్బర్‌సింగ్’ని బ్రాండ్‌గా మారుస్తున్నట్లున్నారు!
బ్రాండ్ కాదు కానీ దాన్తో ఎంటర్‌టైనర్స్ తీద్దామని!

అసలు ‘గబ్బర్‌సింగ్’ పాత్ర పేరు, తతంగం మీ సృష్టేనట!
హైదరాబాద్‌లో కె.ఎస్.ఎన్. మూర్తి గారని పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనను గబ్బర్‌సింగ్ అని పిలిచేవారు. ఆ స్ఫూర్తితో నేను ‘గబ్బర్‌సింగ్’ అనే టైటిల్ పెట్టుకొని, హిందీ ‘దబంగ్’ బేసిక్ ప్లాట్ తీసుకొని, కథ, అంత్యాక్షరి సీన్స్ లాంటి వన్నీ వర్క్ చేశా. ఫోటో షూట్ చేశాక, దర్శకుడు హరీశ్ శంకర్‌ను పిలిచి, సిన్మా అప్పగించా. అలా ‘గబ్బర్‌సింగ్’ వచ్చింది.

ఇంతకీ, ‘సర్దార్...’ను హిందీలో రిలీజ్ చేయడంలోని ఆలోచన?
మన తెలుగు సినిమాల్ని హిందీలోకి డబ్బింగ్ చేసి, వాటిని ‘జీ’ టీవీ లాంటి వాటిలో విపరీతంగా ప్రదర్శిస్తున్నారు. జనమూ చూస్తున్నారు. అలాంటప్పుడు మన సిన్మాను మనమే హిందీలోకి డబ్ చేసి, రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా! తెలుగు సిన్మా మార్కెట్‌ను విస్తరించడానికి ఎవరో ఒకరు ఇలాంటి ప్రయత్నం చేయాలి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో నేను చేసింది అదే! ఈ ప్రయత్నం సక్సెసా, కాదా అన్నది తర్వాత! ముందుగా ఎవరో ఒకరు ఇలాంటివి ప్రయత్నించాలి. వంద సినిమాలతో ప్రయత్నిస్తే, 101వ దానితోనైనా తెలుగు సినిమాకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. అది నా సిన్మా అయినా, కాకపోయినా ఫరవాలేదు. కానీ, మన సినిమాకు మార్కెట్ పెరగడం ముఖ్యం. ఇది ఆ ప్రక్రియలో భాగం.

నెక్స్‌ట్ సినిమా మళ్ళీ ఎప్పుడు?
త్వరలోనే! ఎస్.జె. సూర్య దర్శకుడు.

మీ కాంబినేషన్‌లో ‘ఖుషి’కి ఇది సీక్వెలా?
లేదు. ఇది వేరే. ఫ్యాక్షనిస్ట్ లవ్‌స్టోరీ.

త్రివిక్రమ్‌తో ‘కోబలి’ చిత్రం చేస్తారన్నారు.
ఆ కథ గురించి, అది ఎప్పుడు పట్టాల మీదకు ఎక్కుతుందనేది త్రివిక్రమ్ గారు చెప్పాలి! మీరు ఆయన్ని అడగాలి (నవ్వులు).

మీరు నిర్మాతగా - చరణ్‌తో, మీరు హీరోగా దాసరితో చేస్తామన్న సిన్మాల మాటేమిటి?
అవి చేయాలండి! దాసరి గారు కథ సిద్ధం చేయిస్తున్నారు. కథ పూర్తి అయ్యాక తప్పకుండా చేస్తాం. కానీ, నెల నెలా ఖర్చులు గడవడం కోసం సిన్మాలు చేయాల్సి వస్తోంది. కానీ, మరో రెండు, మూడు చేశాక మానేస్తా.

‘సర్దార్ గబ్బర్‌సింగ్’కు 35 కోట్లు తీసుకున్నారట!
 అది నిజం కాదు. అంత తీసుకోలేదు.

తెలుగులో అత్యధిక పారితోషికపు హీరో మీరేనంటే...
యస్. అయామ్! హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకొంటున్నా. ట్యాక్స్ వాళ్ళనడిగితే చెబుతారు.

ఇంతకీ మీరు ఎంత రిచ్? ఎంత పూర్?
ఇన్‌కమ్ ట్యాక్స్ బ్యాలెన్‌‌సషీట్ చూస్తే 20 కోట్లు డెఫ్సిట్.

మరి సిన్మాలు మానేస్తే ఎలా? ఫ్యాన్స్, ప్రేక్షకులేమవుతారు?
‘ఖుషి’ టైమ్‌లోనే 2-3 సినిమాలు చేసి మానేద్దామ నుకున్నా. కుదరలేదు. ఇప్పుడిక పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేద్దామనుకొంటున్నా. భార్యాబిడ్డల జీవితం గడవడానికి కావాల్సిన కొద్ది డబ్బు సంపాదించి, సిన్మాలు మానేస్తా. రాజకీయాల్లో నేను నాలా ఉండచ్చు. సిన్మాల్లో అలా కాదు.

మీ అబ్బాయి అకీరా ఈ సిన్మా చూశాడా? ఏమన్నాడు?
లేదండీ! చూడలేదు. నేను కూడా వాళ్ళను చూసి, 4 నెలలైంది. ఈ సినిమా బిజీలో పడి వెళ్ళలేదు. పిల్లలు బెంగ పడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజునే వాడి పుట్టినరోజు కూడా! మర్చిపోయాను. సాయంత్రం గుర్తొచ్చి ఫోన్ చేసి, సారీ చెప్పాను. రేపో, ఎల్లుండో పుణే వెళ్ళి, చూసొస్తా.

ఇంతకీ మీరు పవర్‌స్టారా? పవర్ మేకరా? పవర్ మాంగరా?
(నవ్వేస్తూ...) ఇవేవీ కాదు. నేను వట్టి పవన్ కల్యాణ్‌ని! అంతే!
                                                                                                                                     - రెంటాల జయదేవ
                                                                                                                                source:సాక్షి దినపత్రిక