అల్లు అర్జున్ స‌రైనోడు సినిమా రివ్యూ

newsreviews9 11:13:00 AM
 
న‌టీన‌టులు : అల్లు అర్జున్ , ర‌కుల్ ప్రీత్ సింగ్ , క్యాథ‌రిన్ త్రెసా , శ్రీకాంత్ త‌దిత‌రులు
ప్రొడ్యూస‌ర్ : అల్లు అర‌వింద్‌
డైరెక్ట‌ర్ : బోయ‌పాటి శ్రీను
స్టోరీ : బోయ‌పాటి శ్రీను
సంగీతం : ఎస్‌.త‌మ‌న్‌
ర‌న్ టైమ్ : 159 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్ : U/A
రిలీజ్ డేట్ : 22-04-2016

స్టోరీ:
రాష్ర్టానికి సీఎస్ కొడుకు అయిన గ‌ణ‌ (బ‌న్నీ) ఉన్న‌త చ‌దువులు చ‌దివినా ఉద్యోగం చేయ‌కుండా ఆవారాగా తిరుగుతుంటాడు. తండ్రి కోరిక మేర‌కు పెళ్లి చూపుల‌కు వెళుతూ ఆ ఏరియా ఎమ్మెల్యే హ‌న్సితారెడ్డి (కేథ‌రిన్‌)ని రోడ్డు మీద చూసి ల‌వ్‌లో ప‌డిపోతాడు. వెంట‌నే ఐల‌వ్ యూ చెప్పేస్తాడు. ఆమె చుట్టూ నాలుగు సార్లు తిరిగే స‌రికి ఆమె గ‌ణ‌కు ప‌డిపోతుంది. ఓ అమ్మాయిని ఓ బ‌డా బిజినెస్‌మేన్ కొడుకు రేప్ చేసి చంపేస్తాడు. ఈ కేసులో ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల ప‌క్షాన పోరాడుతుంటుంది హ‌న్సితారెడ్డి. నిందితుల‌కు స‌పోర్ట్‌గా నిల‌బ‌డి ఆ కేసులో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చేలా చేస్తాడు సీఎం కొడుకు వైరం ధ‌నుష్‌(ఆది పినిశెట్టి). ఆ టైంలో గ‌ణ ఆది మ‌నుష్యుల‌ను చిత‌క్కొట్టి ఎమ్మెల్యేకు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాడు. చివ‌ర‌కు ఎమ్మెల్యే గ‌ణ‌తో పెళ్లికి సిద్ధ‌మై గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండాల‌ని అమ్మ‌వారి ద‌గ్గ‌ర ప్ర‌మాణం చేయిస్తున్న టైంలో జాను (ర‌కుల్‌ప్రీత్‌)ను విల‌న్లు త‌రుముతూ అక్క‌డ‌కే వ‌స్తారు. జానూను వాళ్లు చంపుతున్న టైంలో ఆమెను చూసి గ‌ణ‌ ఆమెను కాపాడ‌డంతో పాటు జానూ త‌న‌దే అని చెప్పి అంద‌రికి షాక్ ఇస్తాడు. అస‌లు జానుకు గ‌న‌కు గ‌తంలో ఉన్న సంబంధం ఏమిటి ?  వైరం ధ‌నుష్‌కు గ‌ణ‌కు ముందే ఎలాంటి శ‌తృత్వం ఉంది ?  మ‌ధ్య‌లో డీజీపీ సుమ‌న్‌, సీఎంల పాత్ర‌లు ఏంటి చివ‌ర‌కు ఈ స్టోరీ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది అన్న‌ది స‌రైనోడు సినిమా.
విశ్లేష‌ణ :
గ‌న‌గా అల్లు అర్జున్‌, గ‌న‌కి పోటీగా ధ‌నుష్ క్యారెక్ట‌ర్‌లో ఆది సూప‌ర్బ్‌గా చేశారు.. అంద‌మైన ఎమ్మెల్యేగా క్యాధ‌రిన్‌, ఎమోష‌న‌ల్‌గా ర‌కుల్ బాగానే ఆక‌ట్ట‌కున్నారు.. ఇక శ్రీకాంత్ క్యారెక్ట‌ర్‌కి అంత ప్ర‌త్యేక‌త ఏంలేక‌పోయినా శ్రీకాంత్ మాత్రం ఆ పాత్ర‌కి న్యాయం చేశాడు.. క‌ధ విష‌యానికొస్తే సినిమా చూస్తున్నంతసేపు క‌థ తెలిసిన క‌థలా అనిపించ‌టం విశేషం.. పెద్ద‌గా ట్విస్ట్‌లు లేక‌పోవ‌టం, క‌థ‌నం స్లోగా ఉండ‌టం మైన‌స్‌గా నిలిచాయి.. ఇక క‌థ‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా తెరకెక్కించాల‌నుకున్న బోయ‌పాటి ప్ర‌య‌త్నం ప‌ర్వాలేద‌నిపించుకుంది.. స్టైలిష్ స్టార్ మాస్ యాక్ష‌న్ బాగానే ఉన్నా రొటీన్ సీన్స్ అవ‌టంతో కాస్త నిరాశ‌ప‌రిచాయి.. ఇక సినిమాటోగ్ర‌ఫీ విష‌యానికొస్తే బాగానే ఉంది.. ఎడిట‌ర్ ప‌నితనం బాగానే ఉంది.. త‌మ‌న్ సంగీతం సినిమాకి ప్ల‌స్‌కాలేక‌పోయింది.. టైటిల్ ప‌డిన‌ప్పుడు వినిపించే ఆర్ ఆర్ లాస్ట్ వ‌ర‌కూ కంటిన్యూ అవ‌టం విశేషం.. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయ్‌.. ఫైట్స్ బాగానే ఉన్నాయ్ అనిపించుకున్నా కొత్త‌గా లేవు.
  
ప్ల‌స్‌లు :
అల్లు అర్జున్ , ఆది పినిశెట్టి
ఫైట్స్‌
నిర్మాణ విలువ‌లు
మైనెస్‌లు :
రొటీన్ స్టోరీ
లెస్ కామెడీ
త‌మ‌న్ సంగీతం

Share this

Related Posts

Previous
Next Post »