Showing posts with label Trailers. Show all posts
Showing posts with label Trailers. Show all posts

Sachin A Billion Dreams | Official Teaser

newsreviews9 9:30:00 AM Add Comment

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్వయంగా నటించిన సినిమా టీజర్ విడుదలైంది. ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’గా తెరకెక్కుతోన్న ఆయన బయోపిక్‌పై ఇప్పటికే రెండు పోస్టర్లను విడుదల చేశారు. 200 నాట్ అవుట్ మరియు కార్నివాల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో క్రికెట్ లెజెండ్ నటిస్తుండగా.. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహామాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈరోజు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో ముందుగా సచిన్ చిన్ననాటి విషయాలను గుర్తు చేస్తూ... తన తండ్రి వేలు పట్టుకుని వెళ్లడం, తొలిసారి బ్యాట్ పట్టుకుని ఆనంద పడటం, తన అన్నతో క్రికెట్ ఆడటం, స్కూల్లో ఫ్రెండ్స్‌తో కొట్టుకోవడం చూపిస్తూ.. తర్వాత బీచ్ ఒడ్డున నీలిరంగు షర్టు వేసుకుని సచిన్ కనిపిస్తాడు. ఆ తర్వాత సచిన్ గ్రౌండ్‌లోకి వచ్చేముందు అనే పదాలను అంటే..‘‘ వుయ్ వాంట్ సచిన్ వుయ్ వాంట్ సచిన్’ అంటూ అభిమానుల నినాదాలతో..స్టేడియం మార్మోగిపోతుంది. ఈ టీజర్‌తో సచిన్ సినిమాపై అటు క్రికెట్ ఫ్యాన్స్‌లో ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.  గంట వ్యవధిలోనే 8వేలకుపైగా వ్యూస్ వచ్చాయంటే ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో అర్ధమౌతుంది.