మలయాళ చిత్రం ‘ప్రజాపతి’
(2006) సినిమాతో తెరంగేట్రం చేసిన అదితీ రావు హైదరీ అటుపై బాలీవుడ్ పయనమై
‘రాక్‌స్టార్’, ‘వజీర్’, ‘ఫితూర్’ తదితర సినిమాలతో నటిగా చక్కటి గుర్తింపు
తెచ్చకుంది. తాజాగా ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం సినిమాలో అవకాశం అందుకుందట ఈ
హైదరాబాదీ. ‘ఓకే బంగారం’ తర్వాత కార్తి - మణిరత్నం కాంబినేషన్లో ఓ సినిమా
తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి సరసన నటించేందుకు
పలువురు భామల పేర్లు పరిశీలనకు వచ్చినా కడకు ఈ అవకాశం అదితిని వరించిందట.
దీంతో హీరోయిన్ల వేటకు తెరపడినట్టే. జూన్ మొదటివారంలో సినిమా షూటింగ్
మొదలవనుంది.
EmoticonEmoticon