అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత చెన్నై ఆర్కే. నగర్ బరి నుంచి
రెండోసారి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె ఈ స్థానం నుంచే ప్రాతినిథ్యం
వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 16వ తేదీన జరుగనున్న రాష్ట్ర
అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమె ప్రకటించిన అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితాలో ఆమె
పేరు కూడా ఉంది. ఇందులో ఆర్కే నగర్ స్థానం నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు
ప్రకటించారు. ఆమెకు పోటీగా ఎన్నికల బరిలో దిగుతోంది ఓ హిజ్రా.
తమిళ దర్శకుడు సీమాన్ నామ్ తమిళర పార్టీ తరపున ఒక హిజ్రాను బరిలోకి
దించుతున్నారు. ఆమె పేరు జి.దేవి. 33 సంవత్సరాలు. ఆమె సేలం జిల్లా
మగుదంచావడి నివాసి. ఇంటర్ వరకు చదువుకుంది. సామాజిక సేవ చేస్తూ.. సుమారు
200 మంది చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతోంది. అలాగే 60 మంది వృద్ధులు,
పిల్లలకు ఆశ్రయం కల్పించింది. ఆమెను గుర్తించిన సీమాన్.. జయలలితపై పోటీకి
దించాలని నిర్ణయించారు.
మరోవైపు ఈనెల 9 నుంచి సీఎం జయలలిత తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
చుట్టనున్నారు. 9 నుంచి మే 12 వరకు జయ 15 రోజుల పాటు వివిధ దశల్లో ప్రచారం
చేస్తారు. ఇందుకోసం పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు
source: V6 న్యూస్
EmoticonEmoticon