నిజాలు చెప్పిన చెప్పిన ప్రత్యూష ఫ్రెండ్స్

newsreviews9 10:38:00 AM

బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె సన్నిహితులు, స్నేహితులు నమ్మలేకపోతున్నారు. ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తో ఆమెకు విబేధాలున్నాయని చెప్పారు. రాహుల్ , ప్రత్యూషల అనుబంధం గురించి మీడియా సమావేశంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రత్యూషకు ఇటీవల ఓ ఆఫర్ ఇచ్చిన నిర్మాత వికాస్ గుప్తా మాట్లాడుతూ.. రాహుల్ తో సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని ప్రత్యూష భావించిందని చెప్పాడు. రాహుల్ అందరిముందు ఆమెను కొట్టాడని వెల్లడించాడు. ప్రత్యూష సన్నిహితులు ఇంకా ఏం చెప్పారంటే..

  • రాహుల్ తనను మోసం చేశాడని ప్రత్యూష చెప్పింది - కామ్యా పంజాబీ
  • ఆర్థిక సమస్యల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు - శశాంక్ వ్యాస్
  • ప్రత్యూష ఎత్తు చాలా తక్కువ. ఐదు అడుగులా రెండు అంగులాల పొడవు ఉంది. ఆమె ఎలా ఉరి వేసుకోగలదు? - కామ్యా పంజాబీ
  • పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నా. సలోని (రాహుల్ మాజీ గర్ల్ ఫ్రెండ్) తనను బెదిరించిందని మరణించడానికి ముందు రోజు ప్రత్యూష చెప్పింది - న్యాయవాది ఫాల్గుణి
  • రాహుల్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో కలసి ప్రత్యూషను మోసం చేశాడని, చాలాసార్లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చాలా మంది చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు రాహుల్ ను సుదీర్ఘంగా విచారించారు. గత శుక్రవారం ముంబైలోని ప్లాట్ లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

                                                                                                                                source(సాక్షి దినపత్రిక )

Share this

Related Posts

Previous
Next Post »